శివకాశి బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు పలువురికి గాయాలు


0

తమిళనాడులోని శివకాశిలో మరోసారి బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. శివకాశికి సమీపంలోని జమీన్‌సల్వార్‌పట్టి బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు జరిగాయి. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

పేలుడు ధాటికి ధ్వంసమైన భవనం శిథిలాల కింద దాదాపు 20 మంది ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. బాధితులను వెలికితీసిందుకు సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లాల్లో ఉన్న శివకాశి ప్రాంతంలో పెద్ద ఎత్తున బాణాసంచ కర్మాగారాలు ఉన్న సంగతి తెలిసిందే.. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన ఈ ఫ్యాక్టరీలు.. సడలింపులు ఇచ్చిన తర్వాత మళ్లీ బాణాసంచా తయారీని ప్రారంభించాయి.. ఈలోగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

[zombify_post]


Comments

comments