డిస్కస్ త్రో ఈవెంట్ ఫైనల్స్‌లో కమల్‌ప్రీత్ కౌర్


0

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం అయిపోయింది. మహిళల డిస్కస్‌ త్రో క్వాలిఫికేషన్‌ గ్రూప్‌-ఎలో కమల్‌ ప్రీత్‌ కౌర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. కమల్‌ప్రీత్‌ కౌర్‌ తన అద్భుతమైన ప్రదర్శనతో 64 మీటర్లతో రెండో స్థానం సంపాదించి ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఇక, డిస్కస్‌త్రో ఫైనల్‌ ఆగస్టు 2వ తేదీన జరగనుంది.. ఈ ఈవెంట్‌లో మొత్తం 12 మంది పోటీపడనున్నారు. కమల్‌ప్రీత్‌ ఫైనల్లోనూ మంచి ప్రదర్శన చేస్తే భారత్‌ ఖాతాలో మరో పతకం పడనుంది.

మరోవైపు.. ఈ పంజాబ్ అథ్లెట్ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.. ఎందుకంటే ఆమె ఇటీవల రెండుసార్లు 65 మీటర్ల మార్కును అధిగమించింది. మార్చిలో జరిగిన ఫెడరేషన్ కప్‌లో ఆమె 65.06 మీటర్లు విసిరి జాతీయ రికార్డును అధిగమించి.. 65 మీటర్ల మార్క్‌ను అధిగమించిన మొదటి భారతీయురాలిగా నిలిచారు.. ఆ తర్వాత జూన్‌లో, ఇండియన్ గ్రాండ్ ప్రి -4 సమయంలో 66.59 మీటర్లు విసిరి ఆమె తన జాతీయ రికార్డును మెరుగుపరుచుకుని ప్రపంచ ఆరవ స్థానంలో నిలిచింది. మొత్తంగా కమల్‌ప్రీత్‌ కౌర్‌ మరో పతకాన్ని భారత్‌కు అందించనున్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం ఆరంభంలో భారత్‌కి ఆశించని ఫలితాలు దక్కలేదు. ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆర్చర్ అతానుదాస్, జపాన్‌ అథ్లెట్ టకహరు ఫురుకవాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాడు.

బాక్సింగ్‌లో 52 కేజీల విభాగంలో టాప్ బాక్సర్ అమిత్ పంగల్ రెండో రౌండ్‌లోనే ఓడి, తీవ్రంగా నిరాశపరిచాడు.

[zombify_post]


Comments

comments