దృశ్యం 2 షూటింగ్‌ను పూర్తి చేసిన వెంకటేష్


0

విక్టరీ వెంకటేష్‌, మీనా జంటగా మలయాళ దర్శకుడు జీతూజోసఫ్‌ దర్శకత్వంలో దృశ్యం 2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  దృశ్యం సీక్వెల్‌ గా రూపొందుతున్న ఈ సినిమాని సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించింది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు.  తాజా సమాచారం ప్రకారం దృశ్యం 2 సినిమాలో వెంకీ పాత్రకి సంబంధించిన షూటింగ్‌ పూర్తైంది. వెంకటేష్ ఈ సినిమా షూటింగును 45 రోజుల్లో పూర్తి చేసాడు.

దృశ్యం 2 సినిమాతో పాటు వెంకటేష్ మరో సినిమాను కూడా రీమేక్ చేస్తున్నాడు. తమిళ్ సూపర్ హిట్టైనా అసురన్ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ రీమేక్ చేస్తున్నాడు. తెలుగు ఈ సినిమా నారప్పగా వస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ప్రియమణి కీలకపాత్రలో కనిపించనుంది. నారప్ప మే 14న విడుద‌ల కాబోతుంది.

[zombify_post]


Comments

comments