దర్శకరత్న కొడుకు అరుణ్‌‌‌‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు


0

దివంగత దర్శకరత్న దాసరి నారాయణ రావు కొడుకు దాసరి అరుణ్‌‌‌‌పై బంజారాహిల్స్ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించారన్న ఆరోపణలతో బంజారాహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారంలోని మారుతి నగర్‌‌‌‌‌‌‌‌లో ఉండే బ్యాగరి నర్సింహులు పాత సినిమాలకు టెక్నీషియన్‌‌‌‌గా పనిచేస్తుంటాడు.  దాసరి నారాయణరావు దగ్గర 2012 నుంచి 2016 వరకు ఔట్‌‌‌‌సోర్సింగ్ పద్ధతిలో చాలా సినిమాలకు పని చేశాడు. దాసరి నారాయణరావు మృతి తర్వాత పెండింగ్‌‌‌‌లో ఉన్న పనులను జూబ్లీహిల్స్‌‌‌‌లోని ఆయన ఇంటికి వెళ్లి పూర్తి చేశాడు. వీటి నిమిత్తం రావాల్సిన డబ్బు విషయంలో దాసరి కొడుకులు అరుణ్, ప్రభుతో కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది.

ఈ క్రమంలో ఈనెల 13న ఫిలింనగర్‌‌‌‌‌‌‌‌లోని ఎఫ్ఎన్‌‌‌‌సీసీ వద్దకు రావాలని నర్సింహులును అరుణ్ పిలిచాడు. అక్కడికి వచ్చిన నర్సింహులును అరుణ్ కులం పేరుతో తిట్టాడు. దీనిపై ఈ నెల 16న నర్సింహులు ఫిర్యాదు చేయడంతో అరుణ్ కుమార్‌‌‌‌‌‌‌‌పై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

[zombify_post]


Comments

comments