కాబోయే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించైన యువకుడు


విజ‌య‌న‌గ‌రం జిల్లా పూస‌పాటిరేగ మండ‌లం చౌడువాడ‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాబోయే భార్య మరో యవకుడితో మాట్లాడుతుందన్న కోపంతో ఓ కిరాతకుడు యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో అడ్డుకోబోయిన యువతి అక్క, అమె కుమారుడికి కూడా మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం ముగ్గురు బాధితులు విజయనగరం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

చౌడువాడ గ్రామానికి చెందిన రాంబాబుకి అదే గ్రామంలోని యువతితో వివాహం కుదిరింది. అయితే తనకు కాబోయే భార్య మరో యువకుడితో ఆమె మాట్లాడుతోందని పెళ్లి రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి రెండు కుటుంబాలను పిలిచి పోలీసులు రాజీ కుదిర్చారు. పోలీసుల సూచనతో వివాహం చేసుకునేందుకు యువకుడు అంగీకరించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ నిన్న అర్ధరాత్రి సమయంలో యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. దీంతో ఆ యువ‌కుడిని అడ్డుకోబోయిన యువ‌తి అక్క, ఆమె కుమారుడికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న రాంబాబు కోసం గాలిస్తున్నారు.


Comments

comments