టిప్పర్ బోల్తాపడి 13 మంది కూలీల దుర్మరణం


0

మహారాష్ట్రలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుల్ధానాలోని సమృద్ది ఎక్స్‌ప్రెస్  హైవేపై టిప్పర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో  13 మంది కూలీలు  మృత్యవాత పడ్డారు. 

సమృద్ది ఎక్స్‌ప్రెస్  హైవేపై ఐరన్ లోడుతో వెళ్తున్న టిప్పర్‌పై కూలీలు కూర్చొని ఉన్నారు. అయితే ఓ మలుపు వద్ద టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడడంతో టిప్పర్‌పైన కూర్చొన్న కూలీలు అక్కడికక్కడే మరణించారు. మృతులందరూ బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలుగా తెలుస్తోంది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు  ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

[zombify_post]


Comments

comments