చైత్ర తల్లిదండ్రులను కలవనున్న పవన్ కళ్యాణ్


0

తెలంగాణా లోని సైదాబాద్ ప్రాంతంలో ఆరేళ్ళ పసికందు చైత్రను అత్యాచారం చేసిన చంపేసిన ఘటన ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది.  నిందితుడు రాజు పరారీలో ఉండగా సామాన్య ప్రజలతో పాటుగా సినీ తారలు కూడా ముక్తకంఠంతో గళమెత్తుతున్నారు. ఈరోజు చైత్ర తల్లిదండ్రులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్లి కలసి పరామర్శించనున్నట్టుగా తెలిసింది. హైదరాబాద్ లో వారి పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి చైత్ర కుటుంబాన్ని కలవనున్నారట.

సైదాబాద్‌ చిన్నారి అత్యాచారం, హత్యకేసులో నిందితుడు రాజు కోసం వేట కొనసాగుతోంది. ఆరు రోజులు గడుస్తున్నా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు 100 మందితో 10 బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. నిందితుడి సమాచారం చెబితే 10 లక్షలు రివార్డు ఇస్తామని కూడా ప్రకటించింది పోలీస్‌శాఖ. ఆచూకీ తెలిపిన వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

[zombify_post]


Comments

comments