తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బావమ‌రిది చిత్రం 1.1


0

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి త్వరలో ఓ కొత్త హీరో తెలుగు చిత్ర సీమ‌లోకి అడుగు పెడుతున్నారు. ఎన్టీఆర్‌కు స్వ‌యానా బావ మ‌రిది అయిన నార్నె నితిన్ చంద్ర‌.  ఇప్ప‌టికే నితిన్ చంద్ర న‌ట‌న‌, డాన్సులు, యాక్ష‌న్‌కు సంబంధించిన శిక్ష‌ణ‌ను పూర్తి చేసేసుకున్నాడు. ద‌ర్శ‌కుడు తేజ నితిన్ చంద్రను హీరోగా పరిచయం చేయనున్నాడు.

తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 18న చిత్రం 1.1ను లాంఛ‌నంగా ప్రారంభించ‌బోతున్నార‌ట‌. సీత త‌ర్వాత మ‌రో సినిమా ఏదీ చేయ‌ని తేజ‌.. రెండు సినిమాల‌ను అనౌన్స్ చేశాడు. అందులో ఒక‌టి రానాతో, మ‌రోటి గోపీచంద్‌తో. రీసెంట్‌గానే గోపీచంద్ తాను చేయాలనుకున్న మూవీ నుంచి డ్రాప్ అయ్యాడు. దీంతో తేజ‌.. చిత్రం 1.1ను ట్రాక్ ఎక్కించేస్తున్నాడు.

డైరెక్ట‌ర్‌గా తేజ‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం సీక్వెల్ చిత్రం 1.1 ఎలాంటి స‌క్సెస్‌ను అందిస్తుందో చూడాలి.

[zombify_post]


Comments

comments