రాజ్ తరుణ్ స్టాండప్ రాహుల్ ఫస్ట్ లుక్


పవర్ ప్లే సినిమాతో మరో ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ త‌రుణ్ ఇప్పుడు స్టాండప్ రాహుల్ అనే సినిమాను చేస్తున్నాడు. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ ప‌తాకాల‌పై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా సాంటో మోహన్ వీరంకిని ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం చేస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్‌.

ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఈ రోజు విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్‌. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న‌ట్లు ‌ డెస్క్ మీద కూర్చున్న రాజ్‌త‌రుణ్ లుక్ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తుంది. స్టైలిష్ మేకోవ‌ర్‌, స్టైలిష్ హెయిర్‌డోతో క్లీన్ షేవ్‌ లుక్‌లో ఫ‌స్ట్‌లుక్‌లో యూబ‌ర్‌-కూల్‌గా కనిపిస్తున్నాడు రాజ్ త‌రుణ్‌. టైటిల్ ఆసక్తికరంగా ఉండ‌డంతో పాటు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది.

ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా స్వీకర్ అగస్తి సంగీతం, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్ర‌ఫి నిర్వ‌హిస్తున్నారు. వెన్నెల‌కిషోర్‌, ముర‌ళిశ‌ర్మ‌, ఇంద్ర‌జ‌, దేవీ ప్ర‌సాద్ మ‌రియు మ‌ధురిమ ఇతర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.


Comments

comments