ఊతకర్రతో చిరుతను తరిమిన ముంబై మహిళ


0

ముంబై శివారు ప్రాంతం ఆరేలో గ‌త కొన్ని రోజులుగా చిరుత‌లు దాడులు చేస్తున్నాయి.  నిన్న కూడా ఓమ‌హిళ‌పై చిరుత దాడిచేసింది.  అయితే, ఆ మ‌హిళ తనపై దాడిచేసిన చిరుతను ఊతకర్రతో ఎదుర్కొన్న‌ది.  క‌ర్ర దెబ్బ‌ల‌కు తాళ‌లేక ఆ చిరుత అక్క‌డి నుంచి మెల్లిగా జారుకుంది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

నిర్మలా దేవి సింగ్ (55) అనే మహిళ న‌డుచుకుంటూ ఇంటికి తిరిగి వ‌చ్చి వ‌సారాలో కూర్చున్న‌ది. అప్ప‌టికే మూల‌న న‌క్కి ఉన్న చిరుత ఆ మ‌హిళ‌పై దాడిచేసింది. దీనిని గమనించి ఆ మహిళ తన ఊతకర్ర సాయంతో చిరుతను ఎదుర్కొని పక్కకు తోసేసింది. మహిళ ఊత కర్రతో చిరుతను అదిలించడంతో ఆ అడవి జంతువు వెనక్కు తగ్గింది. మ‌హిళ అప్ర‌మ‌త్తంగా ఉండ‌టంతో చిన్న గాయాల‌తో త‌ప్పించుకోగ‌లిగింది.  ఆ వెంట‌నే చుట్టుప‌క్క‌ల‌వారు అక్క‌డికి చేరుకోవ‌డంతో చిరుత పారిపోయింది.  

రెండు రోజుల కిందట ఇదే ప్రాంతంలో నాలుగేళ్ల బాలుడిపై చిరుత దాడికి పాల్పడింది. చిన్నారి తన ఇంటి బయట ఆడుకుంటుండగా వచ్చిన చిరుత పులి దాడిచేసి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసింది. దీనిని గమనించి స్థానికులు పెద్దగా కేకలు వేస్తూ అక్కడకు చేరుకోవడంతో బాలుడ్ని వదిలేసి పారిపోయింది.

[zombify_post]


Comments

comments