మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ ’12TH MAN’


0

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో మలయాళ సినిమాను మరో స్థాయికి తీసుకువెళుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ప్రయోగాలు చాలావరకూ సక్సెస్ అయ్యాయి. మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన 'దృశ్యం' అక్కడ సంచలన విజయాన్ని సాధించింది. అంతేకాదు ఏ భాషలో రీమేక్ చేసినా ఈ కథకి విశేషమైన ఆదరణ లభించింది. ఇటీవల మలయాళంలో 'దృశ్యం 2' పేరుతో సీక్వెల్ చేయగా, విశేషమైన స్పందన లభించింది.

తాజా సమాచారం ప్రకారం మోహన్ లాల్ మరోసారి జీతూ జోసెఫ్ తో చేతులు కలిపాడు. ఈ  సినిమా పేరు '12TH MAN'. ఆశీర్వాద బ్యానర్ పై ఆంటోని పెరంబవూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను ఎనౌన్స్ చేస్తూ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ .. టైటిల్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి.    

'12TH MAN' చిత్రంలో నటించే ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

[zombify_post]


Comments

comments