కొత్త సినిమాటోగ్రఫీ చట్టం పై సూర్య ట్వీట్ దుమారం


0

కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 ను సవరిస్తూ తీసుకున్న నిర్ణయం పై కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ సహా పలువరు ప్రముఖులు మండిపడుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్ట సవరణ సినిమావాళ్ల భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఉందని వారు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సినిమాటోగ్రఫీ చట్టంపై కోలీవుడ్ ప్రముఖులు కమల్ హాసన్, సూర్య, విశాల్ సహా అందరు మండిపడుతున్నారు.  

తాజాగా తమిళ్ స్టార్ హీరో సూర్య ఈ చట్టం పై నిరసన గళం విప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడటమే చట్టం. దాని స్వరతంత్రులను గొంతుకోసి చంపటం కాదు అంటూ చెప్పుకొచ్చారు సూర్య. సూర్య వెలిబుచ్చిన అభిప్రాయలతోనూ సినీ ప్రముఖులు గౌతమ్ వాసుదేవ మీనన్, కార్తీక్ సుబ్బరాజు వంటి వారు ఏకీభవిస్తూ, కేంద్రం చేయబోతున్న చట్టం సరైనది కాదని అన్నారు.

ఇక సూర్య వ్యాఖ్యల పై బీజేపీ నేతలు మండిపడుతూ ఆయనకి హెచ్చరికలు చేసారు. సూర్య తన సినిమాల గురించి మాత్రమే ఆలోచిస్తే బాగుంటుందని, ఇలా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే అనవసర చిక్కుల్లో పడతాడని హెచ్చరించింది.

[zombify_post]


Comments

comments