కళ్యాణ్ రామ్ డెవిల్ ఫస్ట్ లుక్ అదిరింది


0

జయాపజయాలను పట్టించుకోకుండా వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఒక ప్రత్యెక స్థానం దక్కించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ త్వరలో బింబిసారా అనే హిస్టారికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  బింబిసారాతో పాటు కళ్యాణ్ రామ్ మరో సినిమా లైన్ లో పెట్టాడు. కళ్యాణ్ ''డెవిల్'' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన కెరీర్ లో వస్తున్న 21వ మూవీ.  

నేడు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. ఫస్ట్ లుక్ పోస్టర్ లో కళ్యాణ్ రామ్ తుపాకీ పట్టుకొని రైలుకు వేలాడుతూ కనిపిస్తున్నాడు. ఇందులో బ్లేజర్ మరియు పంచెకట్టు ధరించి ఉన్న కళ్యాణ్ రామ్.. పొడవాటి జుట్టు గడ్డం మీసాలతో మ్యాన్లీగా ఉన్నాడు. ట్రైన్ మీద ఇండియన్ ఫ్లాగ్ తో కొందరు వ్యక్తులు ఉండటం చూస్తుంటే.. కళ్యాణ్ రామ్ పెద్ద పోరాటానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. అతని తలకు దెబ్బలు.. ఛాతీ గాయం నుంచి రక్తం కారడం మనం గమనించవచ్చు.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

[zombify_post]


Comments

comments