సీఎం జగన్‌ను కలిసిన అనిల్ కుంబ్లే ఫోటోలు వైరల్


టీమిండియా మాజీ కోచ్‌, దిగ్గజ స్పిన్‌ బౌలర్‌ అనిల్ కుంబ్లే కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను కలిసారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో కుంబ్లే వైయ‌స్ జ‌గ‌న్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. కుంబ్లేను సీఎం జగన్ కండువాతో సత్కరించారు.

ఈ భేటీలో ఇరువురి మధ్య క్రీడల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో స్పోర్ట్స్‌ యూనివర్శిటీ, క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఇరువురు చర్చించారు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల ఏర్పాటుపై దృష్టి సారించాలని, దీనికి తన వంతు సహకారం అందిస్తానని కుంబ్లే సీఎంకు తెలిపారు.  క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీలు ప్రస్తుతం జలంధర్, మీరట్‌ లాంటి నగరాల్లో మాత్రమే ఉన్నాయని, అక్కడి నుంచే అన్ని రకాల క్రీడా సామగ్రి సరఫరా జరుగుతుందని కుంబ్లే.. సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఏపీలో ఫ్యాక్టరీ పెడితే అందరికీ అందుబాటులో క్రీడా సామగ్రి ఉంటుందని ఆయన సీఎంకు వివరించారు.

ఈ సందర్భంగా కుంబ్లే జగన్ కు ఒక బహుమతి అందించారు. ఈ గిఫ్ట్ లో అనిల్ కుంబ్లే కెరీర్ లో 10 మైలురాళ్లను ఓ ఫొటోలో పొందుపరిచి, వాటి వివరాలను కూడా ఫ్రేమ్ చేసి జగన్ కు అందించాడు.


Comments

comments