యూట్యూబ్ స్టార్ ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్


0

యూట్యూబ్ చానల్ ఫన్ బకెట్ తో పాపులర్ అయిన టిక్‌టాక్‌ స్టార్ భార్గవ్‌ చిప్పాడను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికను మాయ మాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో అతను అరెస్ట్ అయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే… విశాఖ జిల్లా పెందుర్తి కి చెందిన ఓ 14 ఏళ్ల మైనర్ బాలికకు టిక్ టాక్ అంటే చాలా ఇష్టం. దీని ద్వారా పెద్ద సెలబ్రేటి కావాలని కలలు కనేది. అదే టిక్ టాక్ ద్వారా పేరు సంపాదించుకున్న భార్గవ్ అలియాస్ ఫన్ బకెట్ బార్గావ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది.

సెలబ్రేటి కావాలనే ఆమె బలహీనతను ముందుగానే గమనించిన బార్గావ్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చెల్లి చెల్లి అని పిలుస్తూనే ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. చాలా సార్లు ఆమె పై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ బాలిక నాలుగు నెలల గర్భవతి ఈ విషయం తన తల్లికి తెలవడంతో ఒక్కసారిగా షాక్ కు గురైన ఆమె పెందుర్తి పోలీసు స్టేషన్ లో భార్గవ్ పై కేసు నమోదు వేసింది. దీంతో భార్గవ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్‌లో అతణ్ణి అదుపులోకి తీసుకున్నారు.

[zombify_post]


Comments

comments