మాజీ ఎంపీ సబ్బం హరి పరిస్థితి విషమం


0

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. పది రోజుల క్రితం ఆయ‌న‌కు కోవిడ్ సోకడంతో వైద్యుల సూచ‌న‌తో హోం ఐసోలేష‌న్‌ లోనే ఉంటూ వైద్యం తీసుకున్నారు. అయితే మూడు రోజుల క్రితం ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గత మూడు రోజులుగా వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి. ఆదివారం ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సబ్బం హరి ఆరోగ్యం విషమించిందని తెలియడంతో పలువురు అభిమానులు విశాఖలో ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

[zombify_post]


Comments

comments