నటుడు పొట్టి వీరయ్య కన్నుమూత


టాలీవుడ్  సీనియర్ నటుడు పొట్టి వీరయ్య (74) కన్నుమూశారు. హైద్రాబాద్ చిత్రపురి కాలనీలో నివాసముంటున్న వీరయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.  వీరయ్యకు ఈ ఉదయం పుచ్చకాయ తిన్న వెంటనే గుండెనొప్పి రావడంతో .. సమీపంలోని సన్ షైన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.  

పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. కేవలం రెండడుగులు ఎత్తు మాత్రమే ఉండే పొట్టివీరయ్య .. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ  భాషలతో పాటు ఒరియా భాషలతో కలుపుకొని  దాదాపు 500 సినిమాల్లో నటించారు. 1969 లో విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన యన్టీఆర్ ‘అగ్గివీరుడు’ సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించారు.  బ్లాక్ అండ్ వైట్ కాలం  నుంచి కలర్ మూవీస్ వరకూ ఉన్న జెనరేషన్స్ లో నటించి మెప్పించారాయన. వీరయ్యకి  ఇద్దరు పిల్లలు.  

రేపు జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో వీరయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.


Comments

comments