పవన్ బర్త్ డే కానుకగా ‘వీరమల్లు’ మేకింగ్ వీడియో


0

వకీల్ సాబ్ సినిమాతో హిట్టు కొట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లో నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా రానా మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ షెడ్యుల్ పూర్తవగానే  పవన్ 'హరిహర వీరమల్లు' సెట్స్ పైకి వెళతారు.

క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. మొగల్ రాజుల కాలం కోహినూర్ వజ్రం చుట్టూ ఈ కథ తిరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో పవన్ బందిపోటు దొంగగా కనిపించనున్నారు. ఆయన లుక్ కి ఆల్రెడీ విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. వచ్చేనెల 2వ తేదీన పవన్ బర్త్ డే కావడంతో, ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియో వచ్చే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

పవన్ కల్యాణ్ కెరియర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్లు వేయించారు. పెద్ద సంఖ్యలో గుర్రాలను వాడుతున్నారు. ఇక కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే పవన్ కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా ఈ సినిమాను నిలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

[zombify_post]


Comments

comments