రవి తేజ ఖిలాడి టీజర్ టాక్


0

ఈ ఏడాది 'క్రాక్' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' అనే సినిమా రూపొందుతోంది.  మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు.  కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ బయటకి వచ్చింది.

యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా చేసుకుని, అన్ని ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. చివరి వరకూ ఎలాంటి డైలాగ్స్  లేకుండా, రవితేజ లైఫ్ లోని పరిణామాలపై కట్ చేసిన విజువల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. విజువల్స్ కి తగినట్టుగా ఆర్ ఆర్ అదిరిపోయింది.  హీరో ఎందుకు క్రిమినల్ గా మారాడు? ఎందుకు జైలుకు వెళ్లాడు? అనే ఆసక్తిని ఈ టీజర్ రేకెత్తిస్తోంది. ముఖ్యంగా టీజర్ లాస్ట్ లో రవితేజ 'ఎమోషన్స్ లేనివాడిని ఎవరూ ఆపలేరు' అంటూ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది.

ఖిలాడి సినిమా మే 28వ తేదిన విడుదల కానుంది.

[zombify_post]


Comments

comments