దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణమోహన్ రావు మృతి


దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత కోవెలమూడి కృష్ణమోహన రావు కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. కృష్ణ మనోహర్ రావుకు ఇద్దరు కుమార్తెలు.

కృష్ణమోహన రావు గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం హైదరాబాదులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ పై ఆయన పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. రేపు ఫిలింనగర్ మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


Comments

comments