సుప్రీంకోర్టు త‌దుప‌రి ఛీఫ్ జస్టిస్‌గా ఎన్వీ ర‌మ‌ణ పేరు సిఫారసు


0

సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ పేరును సీజేఐ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే ప్ర‌తిపాదించారు.  సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో తన త‌ర్వాత చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వీ ర‌మ‌ణ పేరును ఆయన సిఫార‌సు చేస్తూ కేంద్రానికి లేఖ రాసారు.

కృష్ణా జిల్లా పొన్న‌వ‌రంలో ఓ వ్య‌వ‌సాయ కుటుంబంలో జ‌న్మించారు రమణ. ఆయన ప‌ద‌వీ కాలం 2022, ఆగ‌స్ట్ 26తో ముగుస్తుంది. 2000, జూన్ 27 నుంచి 2013, సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కు ఎన్వీ ర‌మ‌ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో జ‌డ్జిగా ప‌ని చేశారు. సుప్రీంకోర్టులో జ‌స్టిస్ బోబ్డే త‌ర్వాత జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ మోస్ట్ సీనియ‌ర్ జడ్జి. ఎన్వీ ర‌మ‌ణ 2022, ఆగ‌స్టు 26న రిటైర్ అవుతారు.

కాగా, గ‌తేడాది అక్టోబ‌ర్‌లో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఎన్వీ ర‌మ‌ణ‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తూ సీజేఐకి లేఖ రాశారు. అమ‌రావతిలో ఆయ‌న‌తోపాటు ఆయ‌న బంధువులు భూ సేక‌ర‌ణ విష‌యంలో అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు జ‌గ‌న్ ఆరోపించారు.

[zombify_post]


Comments

comments