అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం 42 మంది మృత్యువాత


0

ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కబైలియా రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పలు దఫాలుగా మంటలు చెలరేగాయి. ఉష్ణోగ్రతలు పెరగడం, పొడి వాతావరణం కారణంగా అడవిలో కార్చిచ్చు చెలరేగింది. ఈ ఘటనలో కనీసం 42 మంది మరణించినట్లు సమాచారం.  వీరిలో 25 మంది సైనికులు కాగా, 17 మంది సాధారణ పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అల్జీరియాలోని దాదాపు 17 రాష్ట్రాల్లో కార్చిచ్చు చెలరేగుతోంది. 100కు పైగా ప్రాంతాలను మంటలు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న వందమందికిపైగా ప్రజలను సైన్యం రక్షించింది. మంటలను అదుపు చేసే క్రమంలో సైనికులు కూడా పెద్ద ఎత్తున మరణించినట్టు అధికారులు తెలిపారు. అలాగే, మరో 14 మంది సైనికులు తీవ్రంగా గాయపడినట్టు పేర్కొన్నారు.

కొందరు దుండగులు కావాలని నిప్పు పెట్టడం వల్లే ఈ మంటలు చెలరేగుతున్నాయని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కమెల్‌ బెల్డ్‌జౌద్‌ ఆరోపించారు. ప్రధాని సైతం ఈ తరహా అనుమానాలే వ్యక్తం చేశారు.

[zombify_post]


Comments

comments