జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన జెర్సీ


0

కేంద్రం  ప్రకటించిన 67 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ జాతీయ ఉత్తమ తెలుగుచిత్రంగా  నిలిచింది. అంతేకాదు, 'జెర్సీ' చిత్రంతో ఉత్తమ ఎడిటర్ గా నవీన్ నూలి కూడా జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఇక ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం ఎంపికైంది. 'మహర్షి' చిత్రానికి ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలోనూ జాతీయ పురస్కారం లభించింది. రాజుసుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ఎంపికయ్యారు.

ఇక జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్(మణి కర్ణిక)‌, ఉత్తమ నటుడిగా భోంస్లే చిత్రానికి గానూ మనోజ్‌ బాజ్‌పాయ్, అసురన్‌ సినిమాకు గానూ ధనుష్‌‌లను పురస్కారాలు వరించాయి.

ఉత్తమ జాతీయ నటులు – ధనుష్‌, మనోజ్‌ భాజ్‌పాయ్‌
జాతీయ ఉత్తమ నటి – కంగనా రనౌత్‌ (మణికర్ణిక)
ఉత్తమ తెలుగు చిత్రం – జెర్సీ
ఉత్తమ వినోదాత్మక చిత్రం – మహర్షి
ఉత్తమ దర్శకుడు – గౌతమ్‌ తిన్ననూరి
ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – రాజు సుందరం (మహర్షి)
ఉత్తమ ఎడిటర్‌ – నవీన్‌ నూలి (జెర్సీ)
ఉత్తమ బాలల చిత్రం – కస్తూరి
ఉత్తమ హిందీ చిత్రం – చిచోరే
ఉత్తమ తమిళ చిత్రం- అసురన్‌
ఉత్తమ బెంగాలీ చిత్రం- గుమ్‌ నామీ
ఉత్తమ స్టంట్‌ డైరెక్టర్‌- విక్రమ్‌ మోర్‌

[zombify_post]


Comments

comments