జయలలిత పుట్టినరోజు సందర్భంగా తలైవి ట్రైలర్‌ విడుదల


0

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి,  లెజెండరీ నటిి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘తలైవి’ సినిమాకి కేఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తుండగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.  నేడు (మార్చి23)న జయలలిత పుట్టినరోజు సందర్భంగా తలైవి ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

మూడు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్‌ ఆద్యంతం ఎంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా జయలలిత పాత్రలో కంగనా జీవించిందని చెప్పవచ్చు. రాజకీయాల్లోకి రమ్మంటూ ఎంజీఆర్‌ జయలలితను ఆహ్వానించడం..ఆ తర్వాత ఆమె తమిళ రాజకీయాల్లో తలైవీగా ఎలా మారిందన్న అంశాలు ఈ సినిమాలో చూపించనున్నారు. ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి ఆకట్టుకున్నాడు. ప్రకాష్ రాజ్, జిస్సు సేన్ గుప్తా, మధుబాల, భాగ్యశ్రీ ఇతర పాత్రల్లో నటిస్తున్న తలైవి ఏప్రిల్ 23 న విడుదల కానుంది.

[zombify_post]


Comments

comments