కుప్ప కూలిన హెలికాప్టర్ 16 మంది దుర్మరణం


రష్యాలో గురువారం ఉదయం ఘోర  ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్మట్చాలో ఉన్న అగ్నిపర్వతాలను, పర్యాటక ప్రాంతాన్ని చూసేందుకు 16 మంది ప్రయాణికులతో  వెళ్లిన ఎమ్ఐ-8 హెలికాప్టర్ ఈ రోజు తెల్లవారుజామున కూలిపోయింది. 

హెలికాప్టర్ తూర్పు ప్రాంతంలోని కమ్చట్కా ద్వీపకల్పం లోని కురిల్ సరస్సులో కూలిపోయింది. దీంతో మొత్తం 16 మంది మృతి చెందారు.  హెలికాప్టర్ లో ముగ్గురు సిబ్బంది ఉండగా మిగతావారంతా ప్రయాణికులు అని అధికారులు చెబుతున్నారు. 

ప్రమాదం జరిగిన తర్వాత సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.  గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెతికే పనిలో ఉన్నారు. ఇప్పటికే తొమ్మిది మందిని ఈతగాళ్లు గుర్తించారు. మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.


Comments

comments