విజయనగరం ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు మృతి


0

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఏపీ విజయనగరం జిల్లా మహారాజా ఆస్పత్రిలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా పేషెంట్లు మృతిచెందారు. అంతేగాకుండా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని స్థానిక వైద్యులు చెబుతున్నారు. 

ఇప్పటికీ ఆక్సిజన్ సరఫరా  పునరుద్ధరణ కాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ ఆక్సిజన్ సిలిండర్ల కోసం రోగుల బంధువులు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి ప్రాంగణంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే వార్డుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు తీవ్రభయాందోళన చెందుతున్నారు.

[zombify_post]


Comments

comments