క‌ర్నూలులో విషం తాగి ఒకే కుటుంబంలో న‌లుగురి ఆత్మ‌హ‌త్య‌


0

క‌ర్నూలులో హృదయవిదారక ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని నలుగురు విషం తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ విష‌యాన్ని గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. 

మృతుల్లో దంప‌తులు ప్ర‌తాప్, హేమ‌ల‌తతో పాటు వారి కుమారుడు జ‌యంత్‌, కుమార్తె రిషిత ఉన్నార‌ని పోలీసులు చెప్పారు. ప్ర‌తాప్ టీవీ మెకానిక్ గా ప‌నిచేస్తున్నాడ‌ని వారు తెలిపారు. ఇటీవ‌ల స‌న్నిహితులు, బంధువులు మ‌ర‌ణించడంతోనే ఆ కుటుంబం మ‌న‌స్తాపానికి గురైంద‌ని ఆత్మ‌హ‌త్య లేఖ ద్వారా పోలీసులు గుర్తించారు.  

ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

[zombify_post]


Comments

comments