బోయ‌పాటి కేజీఎఫ్ హీరో యష్ ని మెప్పించగలడా?


0

సింహ, లెజెండ్ సినిమాలతో మాస్ దర్శకుడిగా ముద్ర వేయించుకున్న  బోయ‌పాటి శ్రీ‌ను ప్రస్తుతం నందమూరి  బాలకృష్ణ హీరోగా అఖండ అనే సినిమా చేస్తున్నాడు.  ప్ర‌స్తుతం `అఖండ‌` షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. అఖండ చిత్రం తర్వాత బోయ‌పాటి శ్రీ‌ను సినిమా ఏదీ ఫిక్స‌వ్వ‌లేదు. కాక‌పోతే.. క‌థ మాత్రం రెడీగా ఉంది.

బోయ‌పాటి ద‌గ్గ‌ర ఓ మంచి మాస్‌, క‌మ‌ర్షియ‌ల్, యాక్ష‌న్ క‌థ ఉంది. ఆ కథతో కేజీఎఫ్‌తో ఒక్క‌సారిగా స్టార్ గా మారిపోయిన క‌న్న‌డ హీరో య‌ష్‌  తో చేస్తే ఎలా ఉంటుందా? అని బోయపాటి ఆలోచిస్తున్న‌ట్టు టాక్‌.  ఆ క‌థ‌కి య‌ష్ సెట్ అవుతాడ‌ని బోయ‌పాటి శ్రీ‌ను భావిస్తున్నాడ‌ట‌. మ‌రోవైపు సూర్య‌తో బోయ‌పాటి శ్రీ‌ను ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాక‌పోతే… అది మ‌రో క‌థ‌.

మొత్తానికి `అఖండ‌` అవ్వ‌గానే బోయ‌పాటి సినిమాలో హీరోగా నటించేది సూర్య‌నా? య‌ష్ నా? అనేది తేలాల్సివుంది.

[zombify_post]


Comments

comments