అపోలో ఆస్పత్రిలో చేరిన కృష్ణంరాజు


సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. నిన్న సాయంత్రం కృష్ణంరాజు ఆయన ఇంటిలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయినట్లు కథనాలు వెలువడ్డాయి. అపోలో వైద్యులు మంగళవారం ఉదయం తుంటికి శస్త్రచికిత్స చేశారని.  ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు మీడియా వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే కృష్ణంరాజు గారి ఆరోగ్యం బాగుందని.. కేవలం రొటీన్ హెల్త్ చెకప్ కోసం అపోలోకి వచ్చినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలో యూకే వెళ్లాల్సి ఉన్నందున రొటీన్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి అపోలోకి వచ్చినట్లు కృష్ణంరాజు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 

కృష్ణంరాజు గారు సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులతో ఆరోగ్య పరిస్థితిపై చర్చించినట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని కృష్ణంరాజు గారు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేసారు అని సమాచారం. 


Comments

comments