పదో తరగతి విద్యార్థినిని గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడు


0

ఏపీలోని విజయనగరంలో కామంతో కళ్లుమూసుకునిపోయిన ఓ ట్యూషన్ మాస్టర్ పదో తరగతి విద్యార్థినిని గర్భవతిని చేశాడు. నిందితుడికి అప్పటికే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

వివరాల్లోకి వెళ్తే…విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన పదో తరగతి విద్యార్థిని(16) మూడేళ్ల నుంచి ఓ ట్యూషన్ సెంటర్‌కి వెళుతోంది. ఆ బాలికపై ట్యూషన్ మాస్టార్ కన్నుపడింది. ఆ అమ్మాయికి స్పెషల్ క్లాసెస్ చెబుతానని మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకున్నాడు ఆ కామాంధుడు. గత కొన్ని రోజులుగా బాలిక సరిగా భోజనం చేయకపోవడంతో నీరసంగా ఉండసాగింది. దీంతో ఆ బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి బాలిక గర్భవతి అని చెప్పారు. అప్పటికే బాలికకు ఎనిమిది నెలలు రావడం గమనార్హం.

వెంటనే బాధితులు దిశ పోలీస్ స్టేషన్‌ని ఆశ్రయించారు. నిందితుడు చిన్నాను అదుపులోకి తీసుకున్నామని దిశ డీఎస్పీ త్రినాథ్ తెలిపారు.

[zombify_post]


Comments

comments