తిరుమల శ్రీవారి సేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు


0

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం ఉద‌యం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. నిన్న రాత్రే తిరుమల చేరుకున్న జ‌స్టిస్ రమణ దంపతులకు ఈ రోజు ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఇత‌ర అధికారులు వారికి స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం జ‌స్టిస్‌ రమణ దంపతులకు రంగ నాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎన్వీ రమణ దంపతులు బేడీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు.

[zombify_post]


Comments

comments