సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ సెన్సార్ పూర్తి


సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీదేవి సోడా సెంటర్’.. సినిమా ఆగస్ట్ 27న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా ‘శ్రీదేవి సోడాసెంటర్’ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.  

సెన్సార్ సభ్యులు సినిమా చూసి ఎలాంటి కట్స్ లేకుండా  యు/ఎ సర్టిఫికెట్ ను ఇచ్చారని, రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా లాక్ చేశామని చిత్ర యూనిట్ తెలిపింది.  కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్దాయి. ఇటీవల విడుదలైన పాటలు, టీజర్‌ ఆ అంచనాలు మరింత పెంచాయి

విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర  పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.


Comments

comments