తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రియ దంపతులు


0

సినీ నటి శ్రీయ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భర్త ఆండ్రూతో పాటు వీఐపీ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న శ్రియ దంపతులను రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు  ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. శ్రియను చూడడానికి, ఆమెతో ఫోటోలు తీసుకోవడానికి భక్తులు పోటీపడ్డారు.

అనంతరం శ్రీయ మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా స్వామివారిని దర్శించుకోలేకపోయానని అన్నారు. ఇక ఆమె భర్త ఆండ్రీ ఆలయం ముందు శ్రియకి ముద్దు పెట్టి తన ప్రేమను వ్యక్తపరిచారు.  ప్రస్తుతం శ్రియ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం)లో అజయ్‌ దేవగణ్‌కు జోడీగా నటిస్తుంది. అలాగే ‘గమనం’ అనే మల్టీలాంగ్వేజ్‌ చిత్రంలో నటిస్తుంది..

[zombify_post]


Comments

comments