టీడీపీ సీనియర్ నేత పీఆర్ మోహన్ గుండెపోటుతో మృతి


0

టీడీపీ సీనియర్ నాయకుడు, శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ గుండెపోటుతో కన్నుమూశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. టీడీపీ హయాంలో శాప్ చైర్మన్‌గా పనిచేసిన ఈయన టీడీపీలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

"తెలుగుదేశం సీనియర్ నేత, శాప్ మాజీ ఛైర్మెన్ పి.ఆర్ మోహన్ గారి మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. అంకితభావం, నిబద్దతలతో పార్టీకి సేవలందించిన మోహన్ గారి మరణం పార్టీకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్ధిస్తూ, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అంటూ ట్విట్టర్ ద్వారా చంద్రబాబు సంతాపం తెలిపారు.

"పీఆర్ మోహన్ పార్టీకి ఎనలేని సేవలు అందించారని. టీడీపీ పాదయాత్ర విజయవంతం కావడం వెనక మోహన్ కృషి ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని, టీడీపీ నిబద్ధత గల నాయకుడ్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. మోహన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు" నారా లోకేష్ తెలిపారు.

[zombify_post]


Comments

comments