చైతన్యను తాను ముద్దు పెట్టుకోలేదంటున్న సాయి పల్లవి


0

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' చిత్రం గతవారం విడుదలై మంచి టాక్ సాధించింది. నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా లవ్ స్టొరీ నిలిచింది.  ఈ సినిమాలో నాగచైతన్యకు సాయిపల్లవి ముద్దుపెట్టే సన్నివేశం ఉంది. వాస్తవానికి ముద్దు సన్నివేశాలకు సాయిపల్లవి దూరంగా ఉంటుంది. ఇంత వరకు ఆమె అలాంటి సన్నివేశాల్లో నటించలేదు. ఇదే అంశంపై ఓ యూట్యూబ్ ఛానల్ తో సాయిపల్లవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లవ్ స్టొరీ సినిమాలో నాగచైతన్యను తాను ముద్దు పెట్టుకోలేదని… అది కెమెరామెన్ గొప్పదనమని చెప్పారు. తాను ఎప్పుడూ ముద్దు సన్నివేశాల్లో నటించలేదని సాయిపల్లవి తెలిపారు. ఇలాంటి సన్నివేశాలకు తాను తొలి నుంచి దూరమని చెప్పారు. తనకు ఇష్టంలేని పనిని శేఖర్ కమ్ముల చేయించలేదని అన్నారు. తాను నిజంగా ముద్దు పెట్టినట్టుగా కెమెరా యాంగిల్ పెట్టి చూపించారని తెలిపారు.

[zombify_post]


Comments

comments