నారా లోకేష్‌పై వర్మ సంచలన కామెంట్లు


0

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై ట్విటర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘టీడీపీకి లోకేశ్ అనే చిన్న సూక్ష్మజీవి ద్వారా వైరస్ పట్టింది. అది టీడీపీకి ప్రాణాంతకం. ఈ వైరస్ కు ఏకైక వ్యాక్సిన్ ఉంది. దాని పేరు తారక్9999. టీడీపీ కార్యకర్తలకు నా సలహా ఏంటంటే.. మీరు త్వరగా మేల్కొని టీడీపీకి తారక్ 9999 అనే టీకా వేయండి. లేదంటే మీరు, తెలుగుదేశం పార్టీ ఆ ప్రాణాంతక వైరస్ బారిన పడి చనిపోతారు’ అని ట్వీట్ చేశాడు అర్జీవీ.  

వర్మ చేసిన ట్వీట్ పై టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. సినీ నటి, టీడీపీ మహిళా నేత దివ్యవాణి వర్మకు తగువులు పెట్టందే తాగిన ఓడ్కా మత్తు దిగదేమో అంటూ విమర్శించారు.

'నారా లోకేష్ సత్తా ఏంటో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఎన్ని అవార్డ్స్ వచ్చాయో చూస్తే తెలుస్తుంది. నీలా, నీవు వత్తాసు పలుకుతున్న జాంబిరెడ్డిలాగ 420 పనులేవీ చేయెట్లా. నీకు పేటీఎం అనే పిచ్చికుక్క కరిసినట్లుంది. జూనియర్ ఎన్టీఆర్‌గారు ఎప్పుడో చెప్పారు. టీడీపీ కోసం నేను ఎప్పుడైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను అని. నీ నారదుడి సలహా ఆయనకు అక్కర్లా ఎప్పుడేమి చేయాలో ఎన్టీఆర్‌గారికి తెలుసు. నారదుడిలాగ ఎప్పుడూ ఎవరికో ఒకరికి తగువులు పెట్టంది నీకు తాగిన ఓడ్కా మత్తు దిగదేమో. ఇలాగే తాగి వాగితే మా టీడీపీ సైనికులు నీకు ఏదో రోజు దేహశుద్ధి చేయక తప్పదు. తస్మాత్ జాగ్రత్త' అంటూ దివ్యవాణి ఆర్జీవీపై చెలరేగిపోయారు.

[zombify_post]


Comments

comments