అకీరా నందన్ కర్రసాము వీడియో వైరల్


0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం తన తల్లి రేణుతో కలిసి ఉంటున్న అకీరాని పవన్ అభిమానులు జూనియర్ పవర్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. అకీరాకు సంబంధించిన ఫోటోలేమైనా బయటకు వస్తే ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యేలా చేస్తుంటారు పవర్ స్టార్ ఫ్యాన్స్.  

రేణుదేశాయ్ కి కూడా కొడుకు అంటే పిచ్చి ప్రేమ. అప్పుడప్పుడు అకీరాకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ కొడుకుపై ప్రేమను చాటుకుంటుంది. అకీరాకు బుక్స్ చదవడం, మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అని ఇప్పటికే రేణుదేశాయ్ ఓ సందర్భంలో చెప్పింది. తాజాగా అకీరాకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది రేణు దేశాయ్.  ఇందులో అకీరా నందన్ కర్రసాము చేస్తూ కనిపించాడు. జిమ్ లో మాస్క్ వేసుకొని అకీరా కర్రసాము చేసిన ఈ వీడియోకి మైకేల్ జాక్సన్ బిల్లీ జీన్ సాంగ్ ను బ్యాక్ గ్రౌండ్ లో పెట్టి వీడియోను బాగా ఎలివేట్ చేశారు.

ఇప్పటికే కుంగ్ ఫూ, కరాటేతో పాటు మ్యూజిల్, డాన్స్ లలో కూడా అకీరా శిక్షణ తీసుకున్నాడు. ఈ వీడియో చూసిన అభిమానులు అకీరా త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం మొదలు పెట్టేసారు

[zombify_post]


Comments

comments