రష్మిక-విజయ్ డిన్నర్ డేట్ ఫోటోలు వైరల్


-2

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ  'లైగర్' చిత్ర షూటింగ్ కోసం ముంబైలో ఉన్నాడు. 'మిషన్ మజ్ను' సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక మందన్నకూడా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ చేస్తోంది. ఈ క్రమంలో విజయ్, రష్మిక ముంబైలో ఓ స్టార్ హోటల్ లో డిన్నర్ డేట్ కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి.

'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాల్లో కలిసి నటించిన వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ  గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఇద్దరూ కలిసి ముంబైలోని ఓ హోటల్ ముందు కనిపించారు. ఆ సమయంలో రష్మిక చేతిలో వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి. వాటితోనే ఫొటోలకు ఇద్దరూ పోజులిచ్చారు. రష్మిక, విజయ్ చాలా రోజుల తరువాత జంటగా బయట కనిపించడంతో ఫ్యాన్స్ మాత్రం ఆనందిస్తున్నారు.

[zombify_post]


Comments

comments