స్పెషల్ లుక్ లో హైదరాబాద్ కు తిరిగొచ్చిన ప్రభాస్


0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటలీ ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ కు తిరిగొచ్చాడు. 'రాధేశ్యామ్' షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళిన  ప్రభాస్ నిన్న హైదరాబాద్ చేరుకున్నాడు.  హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన బయటకు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయటికి వెళ్లేటప్పుడు ప్రభాస్ తన జుట్టును బీనితో కప్పినట్టు ఆ వీడియోలో కన్పిస్తోంది. ప్రభాస్ బ్లాక్ టీ షర్ట్, లేత గోధుమరంగు ప్యాంటు ధరించి, తలకు బ్లాక్ బీని, సన్ గ్లాసెస్, స్నీకర్లను ధరించాడు. తెల్లటి మాస్క్ కూడా ధరించాడు. రాధేశ్యామ్' చిత్రంలో పూజ హెగ్డే కథానాయికగా కనిపించనుంది.

ప్రస్తుతం ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా, మరి కొన్ని చిత్రాలు ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నాయి. 'రాధేశ్యామ్'తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ తో 'సలార్', దర్శకుడు ఓంరౌత్ తో 'ఆదిపురుష్', దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం చేస్తున్నాడు.

[zombify_post]


Comments

comments