మహేష్ బాబు తండ్రిగా జయరామ్


0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా గీతా గోవిందం ఫేం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.  మహేష్ బాబు ఈ సినిమాలో బ్యాంకు మేనేజర్ కొడుకుగా కనిపించనున్నాడట. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

తాజా సమాచారం మేరకు సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ తండ్రిగా మలయాళ నటుడు జయరామ్ నటించనున్నాడు.  జయరామ్ ‘అల వైకుంఠ పురములో’ సినిమాలో నటించి మెప్పించాడు. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు మహేష్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

[zombify_post]


Comments

comments