సీఎం స్టాలిన్‌ అందరికీ ఆదర్శం అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు సీఎం స్టాలిన్ ని పొగడ్తలతో ముంచెత్తారు. అధికారంలోకి వచ్చాక  సంక్షేమ పాలనను మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారని ప్రశంశించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

"ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి.. కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ తీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని రాష్ట్రాలకు.. అన్ని పార్టీలకు మార్గదర్శకం స్ఫూర్తిదాయకం.. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాని" తెలుగు తమిళ భాషల్లో ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.

ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై జనసేన పార్టీ మళ్లీ పోరాటానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరకాన్ని తలపిస్తున్న రోడ్ల మరమ్మతుల కోసం జనసేన పోరాటానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన రహదారుల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో ఉద్యమం చేయాలని నిర్ణయించింది జనసేన పార్టీ. ఈ విషయాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.


Comments

comments