డీఆర్డీవో కరోనా డ్రగ్ 2-డీజీ సాచెట్ ధర ఎంతంటే


0

క‌రోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతూనే ఉంది. కరోనా కట్టడి కోసం సర్కార్ వ్యాక్సినేష‌న్‌పై ఫోక‌స్ పెట్టింది. కరోనా కట్టడి కోసం ర‌క్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(DRDO)ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్అండ్ అలైడ్ సైన్సెస్, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన న 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్‌ (2-DG)డ్రగ్ రూపొందించింది.

డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధాన్ని ఇప్ప‌టికే విడుద‌ల చేసింది కేంద్రం. ఇక‌, ఇవాళ పొడి రూపంలో ఉండే 2-డీజీ ఔష‌ధం ధ‌ర‌ను ఫిక్స్ చేశారు. ఈ ఔషధం ఒక్కో సాచెట్‌ ధర రూ.990గా డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం డిస్కౌంట్ ధ‌ర‌లో 2డీజీ ఔష‌ధాన్ని అందివ్వ‌నున్న‌ట్లు చెప్పారు. అయితే ఆ డిస్కౌంట్ ఎంత వరకు ఉంటుందన్న వివరాలను వెల్లడించలేదు.

[zombify_post]


Comments

comments