మెగాస్టార్ 153వ సినిమా టైటిల్ గా‘గాడ్ ఫాదర్’ఖరారు


0

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో ఆయన 153వ సినిమాగా 'లూసిఫర్' రీమేక్ రూపొందనుందనే వార్త తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన 'లూసిఫర్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఈ కథ పట్ల చిరంజీవి ఉత్సాహాన్ని చూపించారు. ఈ సినిమాను నిర్మించడానికి చరణ్ తో పాటు ఆర్ బీ చౌదరీ .. ఎన్వీ ప్రసాద్ రంగంలోకి దిగిపోయారు.

లూసిఫర్ తెలుగు రిమేక్ సినిమాకి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. రేపు మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు ఉన్న నేపథ్యం లో మోహన్‌ రాజా దర్శకత్వంలో చిరు నటించే సినిమాకు ”గాడ్‌ ఫాదర్‌ ” అనే టైటిల్‌ ను చిత్ర బృందం ఫిక్స్‌ చేసింది. టైటిల్ ను ఖరారు చేసి, అధికారిక పోస్టర్ ను వదిలారు. టైటిల్ ను డిజైన్ చేయించిన తీరు .. చిరూ లుక్ కొత్తగా .. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.  ఈ మూవీకి తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి… కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఆచార్య సినిమా చివరిదశ షూటింగ్  జరుపుకుంటోంది.

[zombify_post]


Comments

comments