పవన్‌ కళ్యాణ్‌ కు కొత్త పేరు పెట్టిన బండ్ల గణేష్


0

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ కు కోట్లల్లో అభిమానులు ఉన్నారు.  ఆయనను దేవుడిగా ఆరాదించే వారు లక్షల్లోనే ఉన్నారు. అయితే అందరిలోకి బండ్ల గణేష్‌ చాలా ప్రత్యేకం అనడంలో సందేహం లేదు.  బండ్ల గణేష్‌ ఎప్పుడు అవకాసం వచ్చినా తన సర్వం, సర్వస్వం ఆయనే అన్నట్లుగా చెబుతుంటాడు.  పవన్‌ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను అని బండ్ల అందరికీ చెబుతుంటాడు. పవన్‌ కు రకరకాలుగా పేర్లను బండ్ల పెడుతూ ఉంటాడు.

తాజాగా బండ్ల గణేష్‌ పవన్‌ కు ‘దేవర’ అనే పేరును పెట్టుకున్నాడట. పరమ శివుడును దేవర అని పిలుస్తూ ఉంటారు. అందుకే తాను పవన్‌ కళ్యాణ్ ను ఇకపై దేవర అని పిలుచుకుంటాను అంటూ బండ్ల గణేష్‌ చెప్పుకొచ్చాడు. ఈ రోజు నుండి నా బాస్ ని దేవర అని పిలుస్తాను అంటూ ట్వీట్‌ చేశాడు. పవన్‌ తో గబ్బర్ సింగ్‌ సమయంలో దిగిన ఫొటోను బండ్ల గణేష్‌ షేర్‌ చేశాడు.

ఈ దేవర.. బాస్ అన్ని కూడా పవన్ తో మరో సినిమా కోసమేనా అంటూ కొందరు నెటిజన్స్‌ బండ్ల గణేష్‌ ను ఉడికిస్తున్నారు.

[zombify_post]


Comments

comments