బంగ్లాదేశ్‌లో రెండు పడవలు ఢీ 26 మంది జలసమాధి


0

బంగ్లాదేశ్‌ దేశంలో ఘోరం జరిగింది. బంగ్లాలోని షిబ్‌చర్ పట్టణం వద్ద పద్మా నదిలో సోమవారం ఉదయం రెండు పడవలు ఢీకొట్టుకుని 25 మందికిపైగా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

పద్మా నదిలో ఈ ఉదయం ప్రయాణికులతో వెళ్తోన్న పడవను ఇసుక తీసుకెళ్లే బోటు ఒకదానికొకటి ఢీకొట్టాయి. దీంతో అందులోని 26 మంది నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. పడవల్లో 30మందికిపైగా ఉండగా, వారిలో ఐదుగురిని రక్షించినట్టు బంగ్లాదేశ్ పోలీసు చీఫ్ మీరజ్ హోసేన్ తెలిపారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

నదిలో మునిగిపోయిన వారి కోసం గాలింపు చేపట్టారు. నిర్వహణ సరిగా లేకపోవడం, సామర్థ్యానికి మించి పడవలో ఎక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని బంగ్లాదేశ్ పోలీసులు పేర్కొన్నారు. గల్లంతయినవారి కోసం గాలిస్తున్నట్టు వివరించారు.

[zombify_post]


Comments

comments