ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన.. పదవులు ఎవరికంటే


0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రకటన చేశార. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి సుచరిత రాష్ట్ర జిల్లా స్థాయిలో పోస్టులను విడుదల చేశారు. 135 కార్పొరేషన్లు, సంస్థల్లో చైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు.

సామాజిక న్యాయం దృష్టిలో ఉంచుకుని పదవుల భర్తీలో జరుగుతుందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నేతలను సీఎం జగన్‌ గుర్తించారన్నారు. పదవులు అలంకారంగా భావించకుండా.. పదవులు వచ్చిన వారు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు సజ్జల.

* టీటీడీ చైర్మన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డికి అవకాశం
* బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా సుధాకర్
* క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా జోసెఫ్ వెస్లీ
* నెడ్ క్యాప్ చైర్మన్ గా కేకే రాజు
* సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
* వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల
* ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా గేదెల బంగారు
* గ్రంథాలయ ఛైర్‌ పర్సన్‌గా రెడ్డి పద్మావతి
* హితకారిణి సమాజం ఛైర్మన్‌గా కాశీ మునికుమారి
* కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అడపా శేషు
* ఆర్టీసీ రీజనల్‌ ఛైర్మన్‌గా గాదల బంగారమ్మ
* మారిటైం బోర్డు ఛైర్మన్‌గా కాయల వెంకట్‌రెడ్డి
* టిడ్కో ఛైర్మన్‌గా జమ్మాన ప్రసన్నకుమార్‌
* హితకారిణి సమాజం ఛైర్మన్‌గా కాశీ మునికుమారి
* డీసీఎంఎస్ ఛైర్మన్‌గా అవనపు భావన
* బుడా ఛైర్మన్‌గా ఇంటి పార్వతి
* ఏలేశ్వరం డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా శైలజ
* డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కెల నాయుడుబాబు
* ఉమన్‌ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలిని
* ఏపీ గ్రీన్‌ అండ్‌ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రామారావు
* ఏపీ ఎండీసీ ఛైర్మన్‌గా సమీమ్‌ అస్లాం
* సుడా ఛైర్‌పర్సన్‌గా కోరాడ ఆశాలత
* డీసీఎంఎస్ ఛైర్‌పర్సన్‌గా చల్లా సుగుణ (శ్రీకాకుళం జిల్లా)
* డీసీసీబీ ఛైర్మన్‌గా పరిమి రాజేశ్వరరావు (శ్రీకాకుళం జిల్లా)

[zombify_post]


Comments

comments