తిరుమల అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం


1

తిరుమల సప్తగిరుల్లోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్ధలమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక ప్రకటన చేసింది. అంజనాద్రిలోని జాపాలీ తీర్థంలో హనుమంతుడు జన్మించినట్లు పేర్కొంది. ఈ మేరకు తిరుమల నాదనీరాజనం వేదికగా జరిగిన కార్యక్రమంలో జాతీయ సంస్కృత వర్సిటీ ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ ప్రకటించారు.  

హనుమంతుడి జన్మస్ధలంపై వస్తున్న వార్తలపై ఆధారాలు సేకరించేందుకు టీటీడీ గతేడాది డిసెంబర్ లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. హనుమంతుడి జన్మస్ధలంపై నియమించిన కమిటీ పలు పురాణ,వాజ్మయ ,శాసన, భౌగోళిక చారిత్రక ప్రమాణాల ఆధారంగా తిరుమల కొండల్లోని అంజనాద్రిలోనే ఆంజనేయుడు పుట్టాడని వీసీ మురళీధర శర్మ వెల్లడించారు.

వెంకటాచలాన్ని పురాణాల్లో అంజనాద్రి అని పిలేచే వారని, ఆకాశ గంగ తీర్ధంలో 12 ఏళ్లు అంజనా దేవి తపస్సు  చేశారన్నారు. అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించాడని ఆయన అన్నారు. వీటికి రుజువుగా పౌరాణిక,,వాజ్మయ శాసన చారిత్రక ఆధారాలను సమర్పించింది కమిటీ. 12 పురాణాల్లో హనుమంతుడి జన్మస్ధలం తిరుమలలోని అంజనాద్రే అని స్పష్టంగా ఉందని అయన వివరించారు. వెంకటాచలానికి అంజనాద్రితో పాటు 20 పేర్లు ఉన్నాయని ఆయన వివరించారు. వెంకటాద్రినే అంజనాద్రి అని ఆయన అధికారికంగా ప్రకటించారు.  శ్రీరామనవమి నాడు హనుమంతుని జన్మ స్థలం పై టిటిడి అధికారికంగా ప్రకటన చేయటంతో భక్తులు ఆనందోత్సాహాల్లో  ఉన్నారు.

[zombify_post]


Comments

comments