నటి ప‌విత్రా లోకేశ్‌ను మోసం చేసిన మేనేజర్


0

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప‌విత్రా లోకేశ్‌ను ఆమె మేనేజ‌ర్ మోసం చేసిన‌ట్లు తెలుస్తోంది.  పవిత్రా లోకేష్  ఆదాయ వ్యవహారాలన్నీ తన మేనేజర్ చూసుకునేవాడు. అయితే అతను దాదాపు 60 ల‌క్ష‌ల‌కు పైగా జీఎస్‌టీ చెల్లింపులు చేయ‌లేదని.. దీంతో ప్ర‌భుత్వం నుంచి ఆమెకు నోటీసులు అందాయని టీటౌన్ లో వార్తలు రౌండ్ అవుతున్నాయి.

గతంలో సినీ సెలబ్రిటీలు ఎందరో ఇటువంటి మోసాలకు గురయ్యారు. కెరీర్లో బిజీగా ఉండి ఆర్థిక లావాదేవీలను మేనేజర్లను నమ్మి అప్పగించి కోట్లు కోల్పోయిన సెలెబ్రిటీల ఉదంతాలెన్నో జరిగాయి. ఇప్పుడు పవిత్ర లోకేశ్ కూడా ఇదే తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. కొద్దినెలల క్రితం అనసూయ కూడా జీఎస్టీ పన్నులు, ఆదాయ వ్యవహారాలన్నీ తన మేనేజర్ చూసుకునేవాడని.. కానీ తనకు నోటీసులు వచ్చాక మోసపోయానని తెలిసి వాటిని కట్టేశానని అనసూయ చెప్పుకొచ్చింది.

మరి పవిత్రా లోకేష్ ఇందులోనుంచి ఎలా బయటపడుతుందో చూడాలి మరి.

[zombify_post]


Comments

comments