నటుడు వేదం నాగయ్య ఇకలేరు


0

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన "వేదం" చిత్రంలో కీలక పాత్ర పోషించి మెప్పించిన నాగయ్య కొద్ది సేపటి క్రితం మృతి చెందారు.  వేదం సినిమాతో వేదం నాగయ్యగా పేరుపొందిన నాగయ్య లీడ‌ర్, నాగవల్లి, రామయ్య వస్తావయ్యా, స్పైడర్,  పీఎస్వీ గరుడవేగ వంటి సినిమాల్లో నటించాడు.

గుంటూరు జిల్లా, నరసరావుపేట స‌మీపంలోని దేస‌వ‌రం పేట గ్రామ వాసి నాగయ్య. సొంత గ్రామంలో ప‌ని దొర‌క‌క‌పోవ‌డంతో కొడుకుతో క‌లిసి హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. అక్కడ కూలిపని చేసుకుంటుంటే వేదం సినిమాలో అవకాశం వచ్చింది. 'వేదం' సినిమాలో శ్రీను అనే బాలుడికి రాములు తాత పాత్ర‌లో న‌టించి, ఆ సినిమాలో బ‌న్నీతోనూ తాత అని పిలుపించుకున్న నాగ‌య్య మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు.

సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ ఆయ‌న ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోయారు. అనారోగ్యంతో ఆయన భార్య ఇటీవలే కన్నుమూశారు.  ఈ క్రమంలో నాగయ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. దాంతో మా అసోసియేషన్ నెలకు 2,500 రూపాయల పింఛన్ ఇస్తూ అండగా నిలిచింది. నాగయ్య మృతి ప‌ట్ల‌ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

[zombify_post]


Comments

comments