HomeTelugu technology

అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన వివో వి20 2021 స్మార్ట్ ఫోన్‌
Published By :  Sushma Paidipalli Image Image
Vivo released Vivo V20 2021smartphone with advanced features
Thursday Dec 24, 2020
స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో అగ్రగామిగా కొనసాగుతున్న చైనాకి చెందిన మొబైల్స్ త‌యారీదారు వివో త‌న వి20 స్మార్ట్ ఫోన్‌కు గాను కొత్త వేరియెంట్‌ను గురువారం విడుద‌ల చేసింది. వివో వి20 (2021) విడుద‌ల చేసిన ఈ ఫోనులో 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ 730జి ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు.  64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ మోనో సెన్సార్ ల‌ను అమ‌ర్చారు.  ముందు వైపు 44 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ను ఇందులో అందిస్తున్నారు. 8జీబీ ర్యామ్, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఇందులో ఉంది. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు.

వివో వి20 (2021) ఫీచ‌ర్లు

* 6.44 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2400×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 730జి ప్రాసెస‌ర్‌, 
* 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్
* 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆడ్రాయిడ్ 11, డ్యుయ‌ల్ సిమ్
* 64, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 44 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

వివో వి20 (2021) స్మార్ట్ ఫోన్ మిడ్‌నైట్ జాజ్‌, సన్‌సెట్ మెలోడీ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో రూ.24,990 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు అమెజాన్‌లో ల‌భిస్తోంది. అలాగే ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

   Politics

   Lifestyle